
గండీడ్/మహ్మదాబాద్, డిసెంబర్ 13 : గిరిజన తండాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏ ర్పాటు చేయడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి గండీడ్ మండలంలో మొ త్తం 41తండాలు ఉండగా, 500 జనాభా పైబడిన 14తండాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. చౌదర్పల్లి పెద్దతండా, ఆముదాలగడ్డతండా, జిన్నారంతండా, మన్సూర్‌పల్లి, గోవిందుపల్లితండా, చెన్నాయిపల్లితండా, మం గంపేట పెద్దతండా, అన్నారెడ్డిపల్లితండా, నంచర్ల గువ్వనికుంట, ఎల్కిచెరువుతండా, పంచాంగల్తండా, మంగంపేటతండా, సంగాయపల్లి, కొలిమికుచ్చతండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి.
గ్రామాలతో పోటీపడి అభివృద్ధి
తండాలు గ్రామాలతో పోటీపడి మరీ అభివృద్ధి చెందుతున్నాయి. తండాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆదర్శవంతంగా మారుతున్నాయి. ప్రభుత్వ టార్గెట్ మేరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా తండాల్లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు నిర్మించారు. అలాగే హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటి పెంచుతున్నారు. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నారు.