మక్తల్, నవంబర్ 7 : మక్తల్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి స్వైన్‌ఫ్లూ సోకి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం పట్టణంలోని రా ఘవేంద్రకాలనీలో ఉండే సదరు వ్యక్తి ఇం టిని, పరిసరాలను డీఎంహెచ్‌వో సౌభాగ్యల క్ష్మి ఆధ్వర్యంలో వైద్య బృందం పరిశీలించి అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. కాలనీలోని 106 ఇండ్ల వాసులకు పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వి షయం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ద్వారా తమ దృష్టికి రాగానే వెంటనే మక్తల్‌లో సదరు వ్యక్తి నివాసం ఉండే ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు నలుగురులో ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. మిగిలిన ఇద్దరు హైదరాబా ద్ బోడుప్పల్లో ఉండడంతో వారిలో వ్యా ధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు అక్కడి వైద్య బృందానికి స మాచారం ఇచ్చామన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.