అలంపూరు చౌరస్తా , జనవరి 11: సంక్రాంతి పండుగకు సెలవులు రాడవంతో జోగుళాంబ గద్వా ల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద శనివారం సు మారు 3కిలో మీటర్ల మేర వా హనాలు నిలిచి పోయా యి. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో అధిక సంఖ్యలో ఏ పీ , కర్ణాటక రాష్ర్టాలకు ప్ర జలు తరలివెళ్లారు. టోల్ ప్లాజా వద్ద టోల్ మిషన్లు సరిగా పనిచేయక పోవడం తో మాన్యువల్‌గా పంపాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో వాహనాలు భారీగా ని లిచిపోయాయి.
మూసాపేట, జనవరి 11 : సంక్రాంతి సందడి రెండు రోజుల ముందుగానే మొదలైంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్లే రోడ్డు ఆదివారం ఉద యం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్‌తో బిజిగా మారింది. సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు జిల్లాలోని గ్రామాలకు వెళ్లే ప్రజలు సొంత వాహనాలతోపాటు బస్సులు, ఆటోలు, జీపుల్లో త రలివెళ్లడంతో జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ వచ్చింది. అడ్డాకుల మండలంలో ని శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద రద్దీ పెరగడంతో భా రీగా వాహనాలు నిలిచిపోయాయి.