అలంపూర్/మల్దకల్/గట్టు/పెంట్లవెల్లి/మదనాపురం/మానవపాడు/వీపనగండ్ల, మే 17 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలో గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కాగా వర్షపాతం 9.8సెం.మీ.లుగా నమోదైందని ఏఎస్వో శ్రీనివాసులు తెలిపారు. మల్దకల్ మండలంలో 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసీల్దార్ జుబేర్ మొహినుద్దీన్ తెలిపారు.
అదేవిధంగా కేటీదొడ్డి మండలంలో 72.2 మి.మీ., ధరూర్లో 42.1, గద్వాలలో 39, ఇటిక్యాలలో 30.1, మల్దకల్లో 16.4, అయిజలో 26.4, రా జోళిలో 13.3, వడ్డేపల్లిలో 30.5, మానవపాడులో 32.2, ఉండవెల్లిలో 18. 8, అలంపూర్లో 0.2 మి.మీటర్లు, పెంట్లవెల్లిలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

అలంపూరు మున్సిపాలిటీలో శుక్రవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే అక్బర్పేట కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ ఉష్ణోగ్రతలతో వేడెక్కిన భూమి గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షానికి చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. కాగా కొన్నిచోట్ల ధాన్యం కాపాడుకోవడానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షానికి దుక్కులు దున్నుకుని పొలాలను సిద్ధం చేసుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
చిన్నంబావి, మే 17 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. పంటను అమ్ముకునేందుకు మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ధాన్యం తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యా న్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మండల వ్యాప్తంగా వర్షా లు కురవడంతో ఆయా గ్రామాల్లో రైతులు ఆరుతడి పంటలకు సన్నద్ధమవుతున్నారు.