మహబూబ్నగర్ : కుండపోత వర్షంతో (Heavy rain)మహబూనగర్ పట్టణం అతలాకుతలమైంది. అరగంట పాటు కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం, న్యూటన్ చౌరస్తా, బైపాస్ ల వద్ద నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లు చెరువలను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి అప్పనపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాక రహదారి మొత్తం వరదమయంగా మారింది.
బైపాస్ లో క్రిస్టియన్ పల్లి దగ్గర వరద నీరు ఉప్పొంగడంతో రోడ్లు మూసుకుపోయాయి. ఇప్పటికే రెండు సెంటీమీటర్ల వర్షం నమోదయింది. కాగా, లోతట్టు కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ సూచించారు.