జడ్చర్ల/జడ్చర్ల టౌన్/అమ్రాబాద్/తాడూరు/భూత్పూర్/రాజాపూర్, మే 18 : జడ్చర్ల పట్టణంతోపా టు మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. నాగర్కర్నూల్ ప్రధాన రోడ్డుపై వర్ష పు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అన్ని వార్డుల్లోని డ్రైనేజీల్లో నీటి ప్ర వాహం పెరిగింది. పాతబజార్, చైతన్యనగర్కాలనీ, పద్మావతికాలనీ, మదీనాకాలనీ ప్రాంతాల నుంచి వచ్చిన నీరంతా నల్లకుంట ప్రాంతంలో చేరింది. పెద్ద కాల్వ నిండి ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరిం ది. లోతట్టు ప్రాంతాలైన శివాజీనగర్, వెంకటేశ్వరకాలనీ, రాజీవ్నగర్కాలనీల్లోని ఇండ్ల పరిసరాల్లోకి నీరు చేరగా.. పాత మార్కెట్ యార్డు ప్రహరీ కూలి నీరంతా రోడ్డు మీదకు వచ్చింది. దాదాపు అరగంట పాటు భా రీ వర్షం కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాగా ఆయా ప్రాంతా ల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. అమ్రాబాద్తోపాటు పలు గ్రామాల్లో ఉరుములు, మె రుపులతో కూడిన వాన కురవడంతో చెరువులు, కుం టల్లోకి నీరు చేరుతున్నది. భూత్పూర్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజాపూర్ మండలంలో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడవడంతో ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కొ న్ని రోజులు గా వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మే నెలలోనే వానలు కురుస్తుండడం తో రైతులు దుక్కులు దున్నుకొని, విత్తనాలు నాటడా నికి పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.