గట్టు, జూలై 13 : కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉన్నోళ్లను బీఆర్ఎస్ ఎప్పటికీ మరువబోదని, వెన్నంటే ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లో కేటీఆర్ గట్టు మండలం సర్పంచ్ సంఘాల మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా నేత బాసు హనుమంతు నాయుడుతోపాటు జిల్లా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత గద్వాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో ఫో న్లో హనుమంతు మాట్లాడుతూ రాబో యే రోజుల్లో నియోజకవర్గ పార్టీ పగ్గాలు బీసీలకే అప్పగించనున్నట్లు కేటీఆర్ సూచనప్రాయం గా చెప్పారని వివరించారు. ఈనెల 22వ తేదీ (సోమవారం)కేటీఆర్ గద్వాల పర్యటనకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్, కుర్వ విజయ్కుమా ర్, మోనేశ్, తిరుమల్, నూర్పాషా, బాసు గోపాల్, ఎల్లందొడ్డి రాజు, కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.