Kollapur MPDO | కొల్లాపూర్, ఫిబ్రవరి 12 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జయరాం విజయ్ ముచ్చట కొన్ని గంటల్లోనే ముగిసి పోయింది. మంగళవారం ఉదయం కొల్లాపూర్ ఎంపీడీఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కానీ, మంగళవారం సాయంత్రానికి కొల్లాపూర్ ఎంపీడీఓగా ఆయన నియామకం రద్దు చేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో జయరామ్ విజయ్ హుటాహుటినా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
హైదరాబాదులో విజిలెన్స్ విభాగంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా పనిచేస్తున్న జయరాం విజయ్.. బదిలీపై కొల్లాపూర్ ఎంపీడీవోగా వచ్చారు. కానీ, ఆయన బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే జయరాం విజయ్ ఆనందం గంటల్లోనే ఆవిరి అయిపోయింది. కొల్లాపూర్ ఎంపీడీవో గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో వేచి చూడాలని కొల్లాపూర్ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.