మూసాపేట, నవంబర్ 19 : పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామిని బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు దర్శించుకోనున్నారు. చిన్నచింతకుంట మం డలం అమ్మాపూర్ సమీపంలోని ఏడుకొండలపై వెలిసిన అఖిలాం డ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్ర హ్మోత్సవాలకు హాజరయ్యేందుకు ఆయన వస్తున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు రానున్నారు. ఈ నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భూత్పూర్కు చేరుకుంటారు. అక్కడ ఆలతోపాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరుతారు. మూసాపేట మండలంలోని ఆదర్శ మహిళా సెంటర్ వద్ద మం డలానికి చెందిన పార్టీశ్రేణులతో కలిసి అడ్డాకులకు చేరుకుంటారు. కొత్తకోట, మదనాపూర్ మీదుగా ఆలయానికి చేరుకుంటారు. స్వామికి పూజ లు చేసిన అనంతరం నాయకులు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు. అ క్కడి నుంచి మూసాపేట మండలంలోని ఆదర్శ మహిళా సెంటర్ వద్ద మూసాపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు హాజరై వారితోపాటు కలిసి వెళ్తారు.
అక్కడి నుంచి అడ్డాకులకు చేరుకుంటారు. అక్కడ మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గు లాబీ కార్యకర్తలతో కలిసి కొత్తకోటకు.. అక్కడి నుంచి మదనాపూర్లో మండల నాయకులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు స్థానిక నాయకులు సూచించారు. అదేవిధంగా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి వర్గీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. పర్యటనను సక్సెస్ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.