9న వనపర్తికి హరీశ్‌రావు రాక
ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మా ట్లాడుతూ గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన వ్యర్థమని, ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికే కాంగ్రెస్ నాయకుల ప్రయత్నమని అన్నారు.
- గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా..
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పర్యటనను విజయవంతం చేయాలి
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి
- వనపర్తిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం
వనపర్తి టౌన్, ఏప్రిల్ 4 : ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మా ట్లాడుతూ గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదన వ్యర్థమని, ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికే కాంగ్రెస్ నాయకుల ప్రయత్నమని అన్నారు.
గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదన వ్యతిరేక పోరాట సమితి నా యకులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలపడానికి ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటన ఉంటుందని దానిని విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకమని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి ప్రజలకు అండగా నిలవాలన్నారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన ముందుకు తెచ్చారని దీనిని వ్యతిరేకిస్తూ రైతులు 97రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు.
హరీశ్‌రావు పర్యటనతో రైతులకు ఖచ్చితంగా మేలు జరుగు తుందని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మరోసారి నిరంజన్‌రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు అని హరీశ్‌రావు పర్యటనను విజయవంతం చేద్దామని రావుల పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక చేసే ముందు ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీల గురించి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి అమానుషం
మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన దాడి అమానుషమని కాంగ్రెస్ గుండాలు దాడులు చేయడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సమావేశంలో గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, కురుమూర్తియాదవ్, వేణుగోపాల్‌నాయుడు, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

