అచ్చంపేట, ఏప్రిల్ 30 : గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. అచ్చంపేట మం డలం రంగాపూర్‌లో బుధవారం బీఆర్ఎస్ గ్రామ నాయకులు, కార్తకర్తలతో ఆయన స మావేశమయ్యారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారని, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని రంగాపూర్ గ్రామస్తులు వివరించారు.
వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గువ్వల సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆపార్టీని కొంప ముంచనున్నాయని, ప్రజలే మళ్లీ కేసీఆర్‌ను సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. గ్రా మాల్లో అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించలేకపోవడంతో గ్రామాల్లో ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
కార్యకర్తలు, బీఆర్ఎస్శ్రేణులు కలిసికట్టుగా ఉం డాలని, ఎవరికీ ఎలాంటి సమస్య లు ఉన్నా తానున్నానని భయపడాల్సిన అవసరం లేదన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఇచ్చిన సందేశంపై ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, కరెంట్ సమస్యలు మొదలయ్యాయని అధికారులు దృష్టిసారించి పరిష్కరించేందుకు చొరవ చూపాలని సూచించారు.