కోస్గి కాంగ్రెస్‌లో కోల్డ్ వార్..!
కోస్గి కాంగ్రెస్‌లో నాయకుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఏడాదిన్నరకాలంగా నాయకుల మధ్య చెలరేగిన గ్రూప్ రాజకీయాలకు అధికారులు, వ్యవస్థలు బలవుతున్నాయన్న వాదన మండలమంతా విస్తరించింది. బడా నాయకులు ఒక వర్గాన్నే ప్రోత్సహిస్తుండడంతో మరో వర్గం ఆదిపత్యం కోసం ప్రయత్నాలు మొద లు పెట్టింది. అధికారులు తమ మాట వినడం లేదంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు అధిష్టానంతో మొరపెట్టుకుంటున్నారు.
- ఏడాదిన్నరగా నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు
- వీరి బేధాభిప్రాయాలకు బలవుతున్న అధికారులు
కోస్గి, మే 6 : కోస్గి కాంగ్రెస్‌లో నాయకుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఏడాదిన్నరకాలంగా నాయకుల మధ్య చెలరేగిన గ్రూప్ రాజకీయాలకు అధికారులు, వ్యవస్థలు బలవుతున్నాయన్న వాదన మండలమంతా విస్తరించింది. బడా నాయకులు ఒక వర్గాన్నే ప్రోత్సహిస్తుండడంతో మరో వర్గం ఆదిపత్యం కోసం ప్రయత్నాలు మొద లు పెట్టింది. అధికారులు తమ మాట వినడం లేదంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు అధిష్టానంతో మొరపెట్టుకుంటున్నారు.
ఇటీవల ఓ కొనుగోలు కేంద్రం ప్రా రంభోత్సవంలో అధికార పార్టీకి చెందిన ఏఎంసీ వైస్ చైర్మన్ ఫొటో ఫ్లెక్సీపై వెయ్యకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పార్టీ నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. మీర్జాపూర్లో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ తన బాధ్యతను మరిచి సర్పంచ్‌గా ఉన్న తన భార్యను ఇంటికే పరిమితం చేసి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేశారని గ్రామ నేతలు బహిరంగంగా విమర్శిస్తూ రచ్చకెక్కారు. తానే స ర్పంచ్నని చెప్పుకుంటూ నిభందనలను తుంగలో తొక్కి న ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలంటూ సొంత పార్టీ నేతలే అధికారులకు ఫిర్యాదు చేయగా మరో వర్గం ఆ ఫిర్యాదుకు స్పందించొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
రేవంత్‌రెడ్డి సీఎం అయినప్పటి నుంచే తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కొందరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా రు. ఇది ఇలాగే కొనసాగితే తాము పార్టీలో కొనసాగడం కూడా కష్టమేనని తేల్చి చెప్పారు. గుండుమాల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సైతం అధికార కాంగ్రెస్‌లో ఇదే ఆధిపత్య ధోరణి కొనసాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ మారి కొత్తగా వచ్చిన వారికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడంతో ఈ గ్రూపు తగాదాలు మొదలైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

