మహబూబ్నగర్, నవంబర్ 17 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ఉమ్మడి జిల్లాలో సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 154 పరీక్షా కేంద్రాల్లో రెండు పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని 52 కేం ద్రాల్లో పేపర్-1కు 54.69 శాతం, పేపర్-2కు 54.13 శాతం మంది హాజరయ్యారు. 19,465 మందికి ఉదయం 10,646, మధ్యాహ్నం 10,53 8 మంది హాజరయ్యారు. వనపర్తి జిల్లాలో 31 కేంద్రాల్లో 8,312 మంది అభ్యర్థులకుగానూ పేపర్-1కు 4,612, పేపర్-2కు 4,611 మంది హాజరయ్యారు. పేపర్-1కు 55.48 శాతం, పేపర్-2కు 55.47 శాతం మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 25 కేంద్రా ల్లో 8,570 మందికి గానూ పే పర్-1కు 4,789 మం ది (55.88 శాతం), పేపర్-2కు 4,785 మంది (55.83 శాతం) హాజరయ్యారు. నారాయణపేట జిల్లాలో 13 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 4,024 మందికి గానూ ఉదయం 2,353 మంది (58.47 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 2,354 మంది (58.49 శాతం) హాజరయ్యా రు. నాగర్కర్నూల్ జిల్లాలోని 33 కేంద్రాల్లో 9,478 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉం డగా కేవలం 53% మాత్రమే హాజరయ్యారు. దీంతో నాగర్కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి ప్రాంతాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇదిలా ఉండగా, కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెబుతు న్నా.. క్షేత్రస్థాయిలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. నిమిషం నిబంధన ఉండడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరమ య్యారు. దీంతో అభ్యర్థులు కన్నీరు ము న్నీరుగా విలపించారు.