వనపర్తి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : వేరుశనగ పంటను పండించడంలో రికార్డును మూటగట్టుకున్న వనపర్తి జిల్లా నేడు రివర్స్‌లో వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలు తలకిందులవుతున్నాయి. నామమాత్రంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం.. విత్తన ఖరీదు అ ధికంగా ఉండి, విక్రయాల సమయం లో తక్కువ ధరలు వస్తుండడం తో వేరుశనగ సాగుకు రైతన్న లు వెనుకడుగు వేస్తున్నా రు. ఈ పరిస్థితిలో ఇతర ప్రత్యా మ్నాయ పంటల బాట పడుతున్నారు. వేలాది ఎకరాల్లో సాగైన వేరుశనగ నేడు పదుల సంఖ్యకు పడిపోతుండడం విస్మయానికి గురిచేస్తున్నది. ఇప్పటికే విదేశాల నుంచి వంటనూనెలను ఇ బ్బడి మొబ్బడిగా దిగుమతి చేసుకుంటున్న తరుణంలో ఇలా వేరుశనగ సాగుకు రైతులు దూరం కావడంపై ఆలోచించాల్సిన అవసరం లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జిల్లాలో సాగునీటి వనరుల కల్పనతో అన్ని రకాల సాగుబడులు పెరిగాయి. కొత్త రా ష్ట్రంలో సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వడం, పెండింగ్ ప్రాజెక్టులను సైతం పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించడం వల్ల ఒక్కసారిగా సాగుబడులు అమాంతం పెరిగాయి. జిల్లాలో జియోగ్రాఫికల్ ప్రకారం 5.40 లక్షల ఎకరాల భూములుంటే.. వీటిలో 4.31 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైనవి భూములు ఉన్నట్లుగా వ్యవసాయశాఖ అంచనాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 45,356 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. దీన్నిబట్టి ఎక్కువ శాతం రైతులు వరివైపు మాత్రమే మొగ్గు చూపుతుండగా, ఇతర పంటలను కేవలం పదుల సంఖ్యలోనే సాగుబడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగేండ్లు వెనక్కి వెళితే రికార్డు స్థా యిలో సాగైన చరిత్ర వనపర్తి జిల్లాకు ఉన్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అం దునా వనపర్తి ప్రాంతంలో పండించే వేరుశనగ పంట అప్లోటాక్సిన్ రహితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గతంలోనే తేల్చారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా నిరంజన్‌రెడ్డి ఉన్నప్పుడు శాస్త్రవేత్తల ద్వారా పరీక్షలు చేయించగా ఇది బయటపడింది. ఇక్కడి వేరుశనగలో అప్లోటాక్సిన్ (ఫంగస్)లేకపోవడం వల్ల పంట కు అధిక ప్రాధాన్యత ఉందని కూడా శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ వేరుశనగ గింజలో విషపూరిత ఫంగస్ లేనందునా మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. నాణ్యత, రుచితోపాటు ఇతర డ్రై పౌడర్స్కు ఈ వేరుశనగను ఉపయోగించే అవకాశం ఉన్నందునా ప్రాధాన్యత అధికంగా ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా వెల్లడైంది.
ఇదిలా ఉంటే.. జి ల్లాలో భారీగా వేరుశనగను పండిస్తున్న క్ర మంలో ఇదే ప్రాంతంలో వేరుశనగ పరిశోధన కేంద్రం కోసం ప్రయత్నాలు జరిగాయి. వేరుశనగకు అనువైన నేలలున్నందు నా పరిశోధన కేంద్రంతోపాటు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కు మాజీ మంత్రి యత్నించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ నుంచి శాస్త్రవేత్తల బృందం అప్పట్లో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలన చేసింది. అనంతరం ప్రభుత్వం మారడంతో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు ప్రయత్నం మూలకు చేరింది.
జిల్లాలో రైతాంగం వేరుశనగ సాగును పూర్తిగా దూరం పెట్టేశారు. 2 లక్షల ఎకరాలకు పైబడి వరి సాగైతే, వేరుశనగ మాత్రం 1936 ఎకరాల్లో సాగు చేశారు. వరి అనంతరం పత్తి 15 వేల 863 ఎకరాలు, అలాగే మొక్కజొన్న 9475 ఎకరకాల్లో సా గైంది. ఇక మిగితా కందులు, సోయా, జొన్న, మి నుములు, ఆముదం, చెరుకు, ఉల్లి, ఆయిల్‌ఫాం తదితర పంటలను సాగు చేసుకున్నారు. గతంలో 60 నుంచి 70వేల ఎకరాల్లో వేరుశనగ పంటను జిల్లాలో సాగు చేసిన రికార్డు ఉన్నది. కేఎల్ఐ, భీ మా ఎత్తిపోతల నీళ్లు సమృద్ధిగా రావడంతో కొత్త ఊపులో భారీగా ఈ పంటను వేసుకున్నారు. లో తట్టు ప్రాంతం మొదలుకొని ఎత్తైన గుట్టల ప్రాం తాల్లోని భూముల్లో సహితం వేరుశనగను పండించారు. పండిన పంటకు తగ్గట్టుగా అప్పట్లో రైతు లు అమ్ముకున్నప్పుడు ధరలు సహితం బాగా రా వడం వల్ల ఆసక్తి చూపారు. పెద్దమొత్తంలో సాగుబడులు చేసిన పరిస్థితుల నుంచి రైతులు క్ర మంగా ఒక్కో ఏడాది వెనక్కి తగ్గుతూ వచ్చారు.
వేరుశనగ సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం త గ్గిపోయింది. గతంలో విత్తనాలు వేసే సమయంలో సబ్సిడీపై గ్రా మాల్లో లారీల కొద్ది వేరుశనగ పంపిణీ జరిగింది. క్రమంగా సబ్సిడీ ప్రోత్సాహం దూరం కావడం.. విత్తన ధరలు భారీగా పెరగడంతో రైతన్న లు ప్రత్యామ్నాయ అడుగులు వేస్తున్నారు. ఒక ఎకరాలో 80 నుంచి 100 కేజీల విత్తనాలను రైతు వేయాలంటే తక్కువలో తక్కువ రూ.10వేలు(ఎరువు లు మినహ) ఖర్చు అవుతుంది. గతంలో సబ్సిడీ ఉన్నందునా రైతులకు భారం అనిపించలేదు. సబ్సిడీలేని భారంతోపాటు పొలాల్లో అడవి పందులు, కో తులు, నెమళ్ల బెడదలు సహితం ఆటంకంగా మారాయి. అలాగే మద్దతు ధ రలు అంతంతే ఉండడం, తెగుళ్ల బాధలు వెరసి వేరుశనగ సాగుకు అన్నదాత దూరమవుతున్నాడు. ప్రస్తుతం సబ్సిడీపై ఉచితంగా వేరుశనగను కొంతమేర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ రైతులు విత్తనాలు వేయడం కోసం ఆసక్తి కనబర్చడం లేదు. మార్కెట్ యార్డుల్లో వ్యా పారులు వేరుశనగకు సరైన ధరలు లేకపోవడం సాగు తగ్గేందుకు కారణంగా చెబుతున్నారు.