కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన శేఖరాచారి సుమారు 9 గ్రాముల పంచలోహాలతో సూక్ష్మ రామ మందిరం, కలశం, రాములవారి విల్లు, శ్రీరాముడి పాదుకలను తీర్చిదిద్దాడు. వీటిని అయోధ్యకు పంపించనున్నట్లు శేఖరాచారి తెలిపాడు. అలాగే ఆయన కుమారుడు యశ్వంత్‌కుమార్ రామమందిరం నమూనాను, చాక్‌పీస్‌పై రాములోరిని చిత్రించాడు.
వంగూరు, జనవరి 21 : ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి అహంకారపు మాటలు మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ నాడు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం ఎవరితరం కాదన్నారు. ఆదివారం వం గూరులో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉవ్వెత్తున గులాబీ పార్టీ ఎగిసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటుతో మరోసారి బీఆర్ఎస్ పుంజుకోవడం ఎంతో దూరంలో లేదన్నారు. ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసి తర్వాత బీఆర్ఎస్పై విమర్శలు చేయాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యాసంగి సాగుకు ఇప్పటివరకు రైతుబంధు సాయం అందలేదని, ఇక రైతుబీమాకు దిక్కే లేదన్నారు. ఆడపడుచుల పెండ్లిళ్లకు క ల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా116తోపాటు తులం బం గారం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సాగుకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, ఇక సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కేఆర్ఎంబీ ప్రతిపాదిస్తే దానికి తలూపిన రేవంత్ ప్రభుత్వం, ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మా ణం నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని ధ్వజమెత్తారు. గతేడాది డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమా ఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. సమావేశంలో నాయకులు గణేశ్‌రావు, రాజేందర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, ఎల్లాగౌడ్, దేవ, జంగయ్య, నాగేశ్, కృష్ణ, తిరుపతయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.
అచ్చంపేటరూరల్, జనవరి 21 : మండలంలోని రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గాను ఆదివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దర్శించుకొన్నారు. ముందుగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతరలో కలియతిరిగి వ్యాపారులు, భక్తులను పలుకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయ న వెంట పదర జెడ్పీటీసీ రాంబాబునాయక్, ఎంపీపీ శాంతాబాయి, రంగాపూర్ సర్పంచ్ లోక్యానాయక్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు అమీనొద్దీన్, ఖలీల్, ఖాజా, జమాల్ తదితరులు ఉన్నారు.