మూసాపేట, ఆగస్టు 29 : చెక్ డ్యాం నిర్మాణాలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం హ యాంలో రూ.4.79కోట్లతో నిర్మించిన పెద్దవాగుపై చెక్ డ్యాం పనులు ఇటీవలే పూర్తయ్యాయి. మొదటిసారిగా చెక్ డ్యాంలో పూర్తి స్థాయిలో నీరు నిండడంతో గురువారం శాఖాపూర్తోపాటు కందూరు, గడిబండ, పొనకల్, కొమిరెడ్డిపల్లి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానించి సంబురాలు నిర్వహించుకున్నారు.
చెక్‌డ్యాంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు రాజశేఖర్‌రెడ్డి రైతులు, బీఆర్ఎస్ నాయకులు పూలు పసుపు, కుంకుమ పూలతో పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ చెక్‌డ్యాం తోపాటు నియోజకవర్గంలో 30చెక్‌డ్యాంలను నిర్మించామని, అవన్నీ ఇప్పుడు జలకళ సంతరించకున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయన్నగౌడ్, రమేశ్‌గౌడ్, ఖాజఘోరీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.