కొత్తకోట, జూన్ 29: తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావు మార్గమధ్యంలో కొత్తకోట, మదనాపురం ఉమ్మడి మండల కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని కొత్తకోట, మదనాపురం మండల బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని విశ్వేశ్వర్ నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటీ విందులో హరీశ్‌రావు పాల్గొన్నారు. వీరితో పాటు వనపర్తి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహబూబ్‌నగర్ మాజీ క్రీడా, పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కొత్తకోట మండల బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.