వనపర్తి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర ఫలాలు అత్యంత అట్టడుగున ఉండే పేదలకు అందినప్పుడే నిజమైన స్వా తంత్య్రం సిద్ధించినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద గురువా రం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతం త్య్ర ఉద్యమంలో ఎందరో మహనీయులు, ఉద్యమకారులు బలిదానాలు, త్యాగాలు చేశారన్నారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తె లంగాణ నవ నిర్మాణం సాధ్యమవుతుందని, ఈ ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు.
గడిచిన తొమ్మిదేండ్లల్లో అగ్రరాష్ర్టాలతో పోటీపడి తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపామన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మనమంతా కలి సి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కా ర్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు రమేశ్‌గౌడ్, అశోక్, రఘుపతిరె డ్డి, సామ్యానాయక్, పద్మ, వెంకటేశ్, మాణి క్యం, కృష్ణయ్య, సర్ధార్‌ఖాన్, పరంజ్యోతి, నాగన్నయాదవ్, రవి, తిరుమల్, రహీం, గులాంఖాదర్, గౌస్, నీలస్వామి, రాము, గి రి, మధులత, సాయిలీల, కవిత తదితరులు పాల్గొన్నారు.