వనపర్తి, జూలై 24: మలిదశ ఉద్యమంలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించుకొవడంపై సంతోషంగా ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌తో కలిసి కేక్‌కట్ చేశారు. అనంతరం జిల్లా దవాఖానలో రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గట్టుయాదవ్ మాట్లాడుతూ..
మా భవిష్యత్ తరాల నాయకుడు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయూరారోత్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, లక్ష్మయ్య, అశోక్, పరంజ్యోతి, కౌన్సిలర్స్ బండారు కృష్ణ, తిరుమల్, నీలస్వామి, గిరి, రహీం, సునీల్, నర్సింహ, యుగంధర్‌రెడ్డి, రమేశ్, మురళి, రవి, కవిత, జోహెబ్, మన్నెం, పాషా, బాలయ్య, చంద్రయ్య, అఖిలేంద్ర, సుబ్బు, మహేశ్, శ్రీను, ఇంతియాజ్, హలీం, శ్రీను, సత్యం, రవి తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, జూలై 24: మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ జెడ్పీటీసీ రాజేందర్‌సింగ్ నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్‌చేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ రాజేందర్‌సింగ్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, పట్టణ అధ్యక్షుడు నర్సింహులుగౌడ్ మాట్లాడుతూ.. ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తెలంగాణలో అనేక కంపెనీల ఏర్పాటుకు కృషి చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాజ్‌కుమార్, కో ఆప్షన్ సభ్యులు షానవాజ్‌ఖాన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చిన్నబాలరాజు, ఉపాధ్యక్షుడు జింక రవి, నాయకులు రాజేశ్, పురుషోత్తం, శ్రీను, కార్యకర్తలు ఉన్నారు.

పెద్దమందడి, జూలై 24: బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీశ్రేణులు బుధవారం కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో సేనాపతి, పురుషోత్తంరెడ్డి, రాములు, నాగభూషణం, వెంకటన్న, మండల అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
ఖిలాఘనపురం, జూలై 24: మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అయిజ, జూలై 24: తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి ఓటమెరుగని జననేతగా పేరు సుస్థిరం చేసుకున్న గొప్ప నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా నాయకురాలు ప్రేమలత అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం పట్టణంలోని పీహెచ్సీలో గర్భిణులు, బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చిన్న, రాజు, ఆనంద్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, జూలై 24: మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఆదిశిలా క్షేత్రంలో కేటీఆర్‌పై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాతబస్టాండ్ వద్ద పటాకులు కాల్చారు. పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు బస్వరాజు, తిరుమల్‌నాయుడు, మోనేశ్, పరశురాముడు, అబ్బు, గోవిందు, మల్దకల్, హనుమంతు, నాయకులు, కార్యకర్తలు తదితరు లు పాల్గొన్నారు.
కొత్తకోట, జూలై 24: స్థానిక బీఆర్ఎస్ నాయకులు కేక్‌కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, విశ్వేశ్వర్, ప్రశాంత్, నరోత్తంరెడ్డి, శ్రీనివాసులు, అయ్యన్న, భాస్కర్, శ్రీనివాస్, వినోద్‌సాగర్, నెహ్రూ, బాబా, సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, తిరుపతయ్య, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

పెబ్బేరు, జూలై 24: స్థానిక పీహెచ్సీలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, కౌన్సిలర్ చిన్నఎల్లారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు, జూలై 24: మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ నేతృత్వంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, తాజామాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు, జననేత, అభివృద్ధి ప్రదాతగా కేటీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాన్ని ఐటీలో మేటీగా నిలబెట్టిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు కేకును పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.
ధరూరు, జూలై 24: మండలకేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి దవాఖానలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజునాయుడు, యూత్ నాయకులు తిరుమలేశ్, మోనేశ్మారోజ్, వెంకటేశ్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గట్టు, జూలై 24: మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు బీఆర్ఎస్ నాయకులు బ్రెడ్లు, పండ్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజు, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, బాసుగోపాల్, రాజునాయుడు, మాచర్ల లోకేశ్, బాసు బొజ్జయ్య, నాగరాజు, వీరేశ్, గట్టు వెంకటేశ్, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.