పెద్దమందడి, ఏప్రిల్ 10 : పెద్దమందడి మండల కేంద్రంలో పాటు మండలంలోని మనిగిళ్ల, మోజెర్ల, మద్దిగట్ల, గట్ల ఖానాపూర్, అల్వాల గ్రామాలలో గురువారం సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా గ్రామాలలో సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్థానికులకు కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకోవచ్చేటప్పుడు మంచిగా ఆరపెట్టుకొని మట్టి, తాలు లేకుండా చూసుకోవాలన్నారు.
14 శాతం తేమ ఉండాలని సూచించారు. సన్న రకాల వడ్లకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల దగ్గర మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంకాలం వేళలోనే ధాన్యం తూకాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీఈవో జగదీశ్వర్ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.