అచ్చంపేట, మార్చి 30 : పల్లెలు, గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అ న్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను గ్రామ పొలిమేరలో నే పాతరపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవా రం అచ్చంపేట షా మ్స్ ఫంక్షన్హాల్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. గువ్వల పాల్గొని గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. చేయాల్సిన పనుల గురించి ఆరా తీసి సమీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మరో 20 ఏండ్ల పాటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొనేశక్తి ఇతర పార్టీలకు లేదన్నారు. వ్యక్తిగత దాడులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే హస్తం పార్టీ మాత్రం వ్యక్తిగత దాడులకు పాల్పడుతూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. పేదలు, రైతులు, ప్రజలు గులాబీ పార్టీ వైపే ఉన్నారన్నా రు. దేశాన్ని నాశనం పట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్ర శ్నించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు లేదన్నారు. ఢిల్లీలో బీజేపీపై పోరాడే శక్తి లేక భయపడి గల్లీలో పాకులాడుతున్నదని దుయ్యబట్టారు. కమలం పార్టీ అంటేనే రాహుల్‌గాంధీ వణుకుతున్నారన్నారు. బీజేపీ ఆగడాలు అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. మోదీ ప్ర భుత్వాన్ని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో పండిన వరి కొనుగోలు చేయకుం డా వివక్ష చూపుతున్నదన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రంలోని నేతలను ఒప్పించి తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనేలా చేయాలన్నా రు. కేంద్రంపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసేందుకు పార్టీశ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, జెడ్పీటీసీ మంత్రియా నాయక్, సర్పంచ్ లోక్యానాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పులిజాల రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.