మహబూబ్‌నగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త ఆవిష్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎం తైనా ఉన్నదని.. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్‌లోనే సాధ్యమవుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్శిటీలో రెండ్రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్-2022 సదస్సును జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది జీవితంలో భాగమైందన్నారు. ఉన్న వాట్లో మెరుగైన వాటిని కనుగొని నూతన ఆవిష్కరణలు చేయాలన్నా రు. తపన ఉంటే మీరు సాధించగలరు.. అద్భుతాలు సృష్టించగలరన్నారు. గతంలో ఉదయం లేచినప్పటి నుంచి పొద్దుమూకే వరకు దైనందిన కార్యక్రమాల్లో మ నకు తెలియకుండానే అనేక ఎక్సర్సైజులు చేసేవాళ్లమ ని చెప్పారు. రానురాను మిషనరీగా మారిపోయిందని చెప్పారు. దీన్ని రూపుమాపాలంటే ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఆవిష్కరణలు తీసుకురావాలన్నారు. అవసరమై తే ప్రభుత్వం మీ రిసెర్చ్‌కు సహకారం అందిస్తుందన్నారు.
పుస్తకాల రూపంలో తీసుకురావాలన్న దానికి ప్రభుత్వ పరంగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మానసికంగా, సామర్థ్యంగా ఉన్నప్పుడే మెంటల్‌గా బాగుంటాడని పేర్కొన్నారు. దీంతో చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు. టెక్నాలజీ పెరిగాక మనిషి జీవితంలో శారీరక శ్రమ తగ్గి మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. అందుకే రోగాలు పెరిగిపోయాయన్నారు. ఒకటి నుంచి పీజీ వరకు వయస్సుకు తగ్గట్టు పరిశోధన చేసి విద్యార్థులు అలవర్చుకునేలా ఫిజికల్ విద్యా విధానం ఉండే లా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చదువుతోపా టు క్రీడలు, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయ సదస్సులో మంత్రి ఛలోక్తులు విసిరి అందరినీ నవ్వించారు. వేదికమీద ఉన్నోళ్ల పేర్లు చదువుతూ మలేషియా యునివర్శిటీ ప్రొఫెసర్ లింబ్బూన్ అంటూనే.. మీలాగే మాపేర్లు ఇట్ల ఉంటే బాగుండేది అని.. అనగానే అందరూ గట్టిగా నవ్వారు.
హాజరైన అంతర్జాతీయ ప్రముఖులు..
మలేషియా యూనివర్శిటీ ప్రొఫెసర్ లింబ్బూన్ హుయ్, మాజీ స్పోర్ట్స్ డైరెక్టర్ నీరజ్జైన్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి, ఏపీ మాజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ అడ్వయిజర్ చిన్నపరెడ్డి, ఏఐయూ మాజీ సెక్రటరీ ప్రొఫెసర్ గురుదీప్‌సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎన్.రమే శ్, పీయూ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు, పరిశోధకులు ఉన్నారు.
దేశంలోనే మొట్టమొదటి..
ఎన్నోదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడంపై వీసీ రాథోడ్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. దేశంలో ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివిన లక్ష్మీకాంత్ రాథోడ్ దేశంలోనే మొదటి చాన్స్‌లర్ అన్నారు. దేశంలోని ఏ విశ్వవిద్యాలయానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్లు వీసీగా లేరన్నారు. రాథోడ్ ఒక్కడే ఈ ఘనత సాధించారన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
మన్యంకొండ అభివృద్ధికి కృషి
మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 7 : మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు దిగువన ఉన్న చెరువును పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు. చక్కని కోనేరులా తీర్చిదిద్ది, చె రువులో బోటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు పర్యాటక సొబగులతో తీర్చిదిద్దుతామని తెలిపారు.
వెంకన్న ఆలయ కమాన్ నుంచి కొండపై దేవాల యం వరకు నిర్మిస్తున్న రెండు వరుసల రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌ డ్, ఎంపీపీ సుధాశ్రీ, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో అనిల్‌కుమార్, పర్యాటక శాఖ జి ల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.