కోస్గి, జూన్ 18 : ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నిజమైన అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫల మైందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. కోస్గి మండల కేంద్రంలో ఇండ్లు రాలేదన్న మనోవేదనతో కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందిన మణెమ్మ కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన వారి కు టుంబ సభ్యులకు ఆర్థ్థిక సాయం అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చి నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా తమ పార్టీ విధేయులకు మాత్రమే పథకాలు అందేలా చూస్తున్నారన్నారు.
ప్రజాపాలన పేరుతో అధికా రం చేపట్టిన కాంగ్రెస్ అన్నింటిలో పూర్తిగా విఫలమైందని దుయ్యబ ట్టారు. ఏడాది కిందటే మృతురాలు మణెమ్మకు ఇండ్లు మంజూరు చేసి ఉంటే ఆ మె ఇలా మరణించేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి ఇళ్లు పూర్తిగా శి థిలమై ఉన్నా అధికారులకు, నాయకులకు కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతేడాది కమిషనర్ కాళ్లు మొక్కిన ఆయన కనికరించకపోవడం హేయ మైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందిం చి మృతురాలి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆ దుకోవాలన్నారు. కార్యక్రమంలో కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట్ నర్సిములు, నరేందర్‌రెడ్డి, బెజ్జు నీలప్ప, జనార్దన్‌రెడ్డి, కోనేరు సాయప్ప, కోట్ల మహిపాల్, నరేశ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.