గద్వాల అర్బన్, ఫిబ్రవరి 22 : వ్యవసాయశాఖలో నకిలీ ధ్రువపత్రాల పొంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్య క్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన డీఎస్పీ వివరాలు వెల్లడించారు. 20 17 సంవత్సరంలో మల్దకల్లో విధులు నిర్వహించిన నరేశ్‌కుమార్ నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందాడనే వ్యవహారం బయటికి పొ క్కింది.
ఈ వ్యవహరంపై వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ దృష్టి సారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెం దిన నరేశ్‌కుమార్, నాగరాజు మధ్యవర్తి బాలకృష్ణతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాపూర్, హాజీపూర్ యూనివర్సిటీల నుంచి అగ్రికల్చర్ డిప్లామా పట్టాలు పొందారన్నారు. ఇందుకు రూ.90వేల నుంచి రూ.లక్షా 20వేల వరకు డబ్బులు అందించినట్లు తెలిపారు. మధ్యవ ర్తి బాలకృష్ణ పరారీలో ఉన్నాడని, అదుపులోకి తీసుకొని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో సీఐ శ్రీ ను, ఎస్సై కల్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.