ఊట్కూర్ : మహిళల ఆర్థిక అభివృద్ధికి (Economic development ) తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మాజీ ఎంపీపీ ఎం మణెమ్మ( Manemma) అన్నారు. శుక్రవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళా శక్తి( Mahila Shakti ) సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పాటల రూపంలో మహిళలకు వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు భరోసా, విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం నిర్మల, మండల మహిళా ఓబీలు శివలీల, రాధ, సునీత, సీసీలు వెంకటయ్య లక్ష్మీ, సుగుణ, సుమతి, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రవిశంకర్, బాలయ్య, కిరణ్ , అరుణ, సుగుణ పాల్గొన్నారు.