కొత్తకోట : రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ హెచ్చరించారు. శుక్రవారం బిల్డింగ్ వర్కర్స్ సమస్యలపై చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరు సబబు కాదని నిక్సన్ అన్నారు. 60 ఏళ్లు నిండిన బిల్డింగ్ కార్మికునికి పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని, వారి కుటుంబంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు వర్తింపచేయాలని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న 11 లక్షల లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాదులో కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుండగా పోలీసులు బిల్డింగ్ వర్కర్స్‌ను అడ్డుకున్నారు. అరెస్టయిన వారిలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కావలి చిన్న వెంకటయ్య, బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి పోతులపల్లి కురుమూర్తి ఉన్నారు.