ధన్వాడ, డిసెంబర్ 30 : రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పించిందని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గున్ముక్ల, గోటూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో రైతు వేదికలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాతనే రైతులకంటూ ఓ భరోసా కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. రైతు బీమా ప్రవేశపె ట్టి అ కుటుంబానికి మేము ఉన్నామంటూ అభయమి చ్చాం… చనిపోయిన రైతు కుటుంబాల వారికి ఇప్పటి వర కు జిల్లాలో రూ.118 కోట్లాకు పైగా బీమా డబ్బులు నామి నీ ఖాతాలో జామ చేశామన్నారు. రైతు బాగుంటేనే గ్రామీ ణ ఆర్థిక పరిస్థితి బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికా రి జాన్ సుధాకర్, జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖారెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రదీప్‌కుమార్, జెడ్పీటీసీ విమల, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నా యకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
క్యాలండర్ ఆవిష్కరణ
మండలంలోని గోటూర్లో జేవైఆర్ ట్రస్ట్‌కు చెందిన ఎ మ్మెల్యే క్యాలండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.