తిమ్మాజీపేట, ఏప్రిల్ 2 : తిమ్మాజిపేట మండల కేంద్రంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 17 శతాబ్దంలోనే పాపన్న గౌడ్ బహుజనుల కోసం పోరాడారు అన్నారు.
నాటి నాటి పాలకులను ఎదిరించి, సామాన్యులకు న్యాయం జరిగేలా పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. స్వయంగా కొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలన సాగించా,న్నారు. నేడు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు నాగరాజు గౌడ్, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, చంద్రమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.