వనపర్తి, జూన్ 29 : వైద్య సేవల్లో దేశంలోనే తెలంగాణ మెరుగైన సేవలను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 239 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు సొంత డబ్బులతో సమకూర్చిన కిట్లను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్ర పాలనలో ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, కేసీఆర్, న్యూట్రిషన్ కిట్లు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్, రైతులకు సాగునీరు, రైతుబంధు, రైతుబీ మా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నామన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు పాటించాలని, బలవర్థకమైన ఆహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రో గ్రాం అధికారి డాక్టర్ సాయినాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.