Rajender Reddy | మరికల్ : నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేసిన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు.
ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వీరభసంతు, కానుగంటి నారాయణ మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా ఏర్పాటుతోపాటు మెడికల్ కళాశాల, మరికల్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టిన ఎస్సార్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి నారాయణపేట ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సార్ రెడ్డి ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీ నాయకత్వం ఆలోచించి ఎస్సార్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పెంటమీది నరసింహులు, వెంకటేష్ గౌడ్, మక్తల్ రాజారెడ్డి, బొంబాయి కొండన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.