వనపర్తి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఒక రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే కష్టాలనేకం ఉంటాయి. భూములు, ఇండ్లు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఎక్కువగా జరుగుతాయి. వీటికి తోడు రుణాలిచ్చే క్రమంలో మార్టిగేజ్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇలా ఒక్క వ్యవహారం రిజిస్ర్టేషన్ వరకు రావాలంటే.. దానికి ముందు నెలల తరబడి కసరత్తు జరిగితేనే రెఢీ అవుతుంది. డబ్బుల లా వాదేవీలు.. ఇతర సమస్యలు అన్ని కొలిక్కి వచ్చేలా చేసుకొని చివరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పూనుకుంటారు. తీరా కార్యాలయానికి వచ్చే సరికి సర్వర్ డౌన్ అంటూ అధికారులు చెబుతుండడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. వనపర్తి రిజిస్ట్రేషన్ల కార్యాలయానికి గురువారం దాదాపు 50మంది డాక్యుమెంట్లతో వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఇండ్లు, ప్లాట్లు, కొన్ని మార్టిగేజ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. అయితే ఉద యం కొంత సమయం మాత్రమే సర్వర్ పనిచేసినట్లు కనిపించిం ది. వచ్చిన వారందరికీ సర్వర్ ప్రాబ్లం ఉందని, మంచిగా అవుతుం దని చెబుతూ సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం చుట్టూ తిప్పుకొన్నారు. తీరా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. చివరకు రా ష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తిందంటూ అధికారులు సమర్థించుకుంటూ లబ్ధిదారులకు సెలవిచ్చారు. మధ్యలో వస్తుందేమో అనుకొని ఆశతో చివరి నిమిషం వరకు జనం కార్యాలయం వద్దే వేచి ఉన్నారు. ఒక్క రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రెండు వైపులా కలిసి ఐదు నుంచి పదిమంది వరకు కార్యాలయానికి రా వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారితోపాటు సాక్షులు తదితర పెద్దమనుషుల సమక్షంలో ఈ తతంగం పెద్ద ఖర్చుతో కూడు కున్నది. వీటికి అదనంగా ఇక రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో ఉండే దోపిడీ ఉండనే ఉంటుంది. ఇలా అన్ని వ్యయ ప్రయాసాలకోర్చి రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకొని వచ్చిన వారికంతా అ ధికారుల నిర్లక్ష్యం వల్ల నిరాశే ఎదురైంది.
రిజిస్ట్రేషన్లకు అప్పుడప్పుడు సర్వర్ సమస్య వస్తుంది. అయితే త్వరగానే సమస్య తీరిపోయేది. ఇంతలా సమస్య ఎప్పుడూ రాలే దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల పనే జరగలే దు. అయితే వచ్చిన డాక్యుమెంట్లను కంప్యూటర్లలో నమోదు చే శాం. కానీ మళ్లీ రేపు వస్తేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతుంది. ఈ-కేవైసీ సమస్య ద్వారా గురువారం కార్యాలయంలో పని జరగలేదు. 40కి పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చాయి.