అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 24 : జోగుళాంబ రైల్వే హాల్ట్‌లో అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ అన్నా రు. గురువారం ఉండవల్లి మండలంలోని ఉ న్న జోగుళాంబ హాల్ట్‌లో రూ.6 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులు పరిశీలించారు.
మొ దట ఆయన జోగుళాంబ రైల్వే స్టేషన్‌కు రావడంతో సౌత్ సెంట్రల్ ఉద్యోగులు కర్నూల్ బ్రాంచ్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి ము న్నాజీరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ప్లాట్‌ఫాం, విశాంత్రి గ దులను పరిశీలించారు. రైల్వే వంతెన, ట్రాక్ నమూనాను పరిశీలించారు. ఆయన వెంట జోగుళాంబ రైల్వే అధికారులు పాల్గొన్నారు.