పాలమూరు, సెప్టెంబర్ 16 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం వినాయకుడి నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలందుకొన్న గణనాథులను ఉత్సాహంగా ఊరేగింపు చేపట్టి నిమజ్జనానికి తరలించారు. కొలాటాలు, అడుగుల భజనలు, డ్యాన్స్‌లతో అలరించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు బందోబస్తు పర్యవేక్షించారు.
ఊట్కూర్, సెప్టెంబర్ 16 : తొమ్మిది రోజులపాటు విశేష పూజలనందుకున్న గణపయ్యలను సోమవారం ఊట్కూరు పెద్ద చెరువుతోపాటు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఎస్పీ యోగేశ్ గౌత మ్, డీఎస్పీ లింగయ్య, సీఐలు చంద్రశేఖర్, రామ్‌లాల్, ఎ స్సై కృష్ణంరాజు బందోబస్తును పర్యవేక్షించారు.
హన్వాడ, సెప్టెంబర్ 16 : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని టంకర, చిన్నదర్పల్లి, హన్వాడలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.
కృష్ణ, సెప్టెంబర్ 16 : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం వినాయక మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు. మండలంలోని గుడెబల్లూర్‌లో భజరంగ్ యూ త్, ఎస్ఏవైఎఫ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
మరికల్, సెప్టెంబర్ 16 : మండల కేంద్రంలోని హన్మాన్‌వాడ వినాయక విగ్రహం వద్ద వీరన్న రూ.లక్షా 55వేల 116లకు లడ్డూను వేలంలో దక్కించుకున్నాడు. అలాగే ఫ్రెండ్స్ వినాయక మండపం వద్ద అంజనేయులు రూ.లక్షా 25,116లకు లడ్డూను దక్కించుకున్నారు.
ధన్వాడ, సెప్టెంబర్ 16 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక నిమజ్జనం సోమవారం ఘనంగా నిర్వహించారు.
నవాబ్‌పేట, సెప్టెంబర్ 16 : మండలంలోని సత్రోనిపల్లితండాలో గణేశ్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. కొల్లూరు శివారులోని పెద్ద చెరువులో గణనాథుడిని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నాయకులు చందర్‌నాయక్, తుల్సీరాంనాయక్, సేవ్యానాయక్, రత్నబాబునాయక్, మహేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట/రూరల్, సెప్టెంబర్ 16 : గణేశ్ నిమజ్జన శోభాయాత్రను మంగళవారం నిర్వహించనుండగా, పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. సోమవారం ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిమజ్జనం చేసే చెరువులు, కుం టల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని, ఇద్దరు డీఎ స్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మండపాలు, ప్రార్థన మందిరా లు, నిమజ్జనం చేసే చెరువులు, ప్రధాన చౌరస్తాల్లో బాంబు డిస్పోజబుల్ స్కాడ్స్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నారాయణపేట మండలంలోని జాజాపూర్, అప్పిరెడ్డిప ల్లి, కోటకొండ, అభంగాపూర్, బండగొండ తదితర గ్రామా ల్లో నిమజ్జనం చేశారు.
జడ్చర్ల, సెప్టెంబర్ 16 : జడ్చర్ల మున్సిపాలిటీలో గణేశ్ విగ్రహాల నిమజ్జన కనుల పండువగా నిర్వహించారు. పాతబజార్‌లో ఉట్లు కొట్టారు. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో బాదేపల్లి నేతాజీచౌక్‌లో స్వాగతతోరణం ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేసే నాగసాల చెరువు వద్ద రెండు భారీ క్రేన్ల సాయంతో విగ్రహాలను చెరువులో నిమజ్జనం చే శారు. సిగ్నల్‌గడ్డ వద్ద ముదిరాజ్ వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ తరఫున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ప్రా రంభించారు. మహబూబ్‌గనర్ అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ నర్సింహులు, జడ్చర్ల సీఐ ఆదిరెడ్డితోపాటు మరో సీఐలు, ఎస్సైలు, 70 మంది పోలీసులతో బందోబస్తును నిర్వహించారు.
జడ్చర్లలో సాయినగర్ కాలనీలో నిర్వహించిన వేలం పాటలో వినాయక లడ్డూ రూ.2,00,116 పలికింది. ఈ లడ్డూను ఆలయ ధర్మకర్త పాలాది రమేశ్ దక్కించుకున్నారు. బ్యాండుమేళాలతో లడ్డూను ఇంటికి తీసుకెళ్లారు.