నవాబ్‌పేట, ఫిబ్రవరి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభ సంతరించుకోనున్నాయని ఎంపీపీ అనంతయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో మనఊరు-మనబడి కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎంపీపీ హాజరై మాట్లాడారు. మనఊరు- మనబడితో పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటు నూతన భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్ వసతి, తాగునీరు, క్రీడామైదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నవాబ్‌పేట మండలంలో మొదటి విడుతగా 23 పాఠశాలలు ఎంపికైనట్లు చెప్పారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, హెచ్ఎం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాఠశాలలకు అవసరమయ్యే ప్రణాళికలను వారంలోగా సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మండల ప్ర త్యేకాధికారి సుధాకర్, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఎంఈవో రాజునాయక్, జీహెచ్ఎంలు దశరథ్‌నాయక్, వెంకటేశ్వరమ్మ, వివిధ గ్రామాల స ర్పంచులు, ఎంపీటీసీలు, ఎస్ఎం సీ చైర్మన్లు, హెచ్ఎంలు ఉన్నారు.
విద్యావ్యవస్థలో మార్పు ;ఎంపీపీ కమల
బాలానగర్, ఫిబ్రవరి 25 : మనఊరు- మనబడి కార్యక్రమంతో విద్యావ్యవస్థలో మార్పు చోటుచేసుకుంటుందని ఎంపీపీ కమల అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మనఊరు-మనబడి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండలంలోని 22 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసిందని, దాతల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స మావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో శ్రీదేవి, తాసిల్దార్ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎంఈవో వెంకటయ్య, సర్పంచులు గోపీనాయక్, రవినాయక్ తదితరులు తదితరులు ఉన్నారు.