వనపర్తి, ఆగస్టు 11 : డ్రైవింగ్, లర్నింగ్ లైసెన్స్ కావాలన్నా.. స్లాట్ బుకింగ్ కావాలన్నా.. తప్పకుం డా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిందే. కానీ ఇవేవీ లేకుండా ఇప్పుడు అరచేతిలోనే రవాణా సేవలు పొందొచ్చు. టీ యాప్ ఫోలియో ద్వారా కార్యాలయానికి వెళ్లకుండా సేవలు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రవాణా సే వలు మరింత సులభంగా మారాయి. వాహనదారు లు కార్యాలయాలకు వెళ్లకుండా ఎక్కడినుండైనా డూప్లికేట్ లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జ్ వంటి పలు రకాల సేవలు పొందొచ్చు. సమయం, డబ్బు లు వృథా కాకుండా స్మార్ట్ ఫోన్లో సేవలకు సంబంధించిన రుసుం చెల్లించి వేగంగా, సులభంగా పని చేసుకోవచ్చు.
యాప్ ఉపయోగించే విధానం..
స్మార్ట్ ఫోన్లో టీ యాప్ ఫోలియో అప్లికేష న్ డౌన్లోడ్ చేసుకోవాలి.
మొబైల్ నెంబర్ నమోదు చేసి ఎంపిన్ పొందాక లాగిన్ అవ్వాలి.
‘ఆర్టీవో’పై క్లిక్ చేయాలి.
లైసెన్స్‌కు సంబంధించిన సేవలు వస్తాయి.
డ్రైవింగ్ లైసెన్స్ సేవలు : డ్రైవింగ్ లైసెన్స్‌పై క్లిక్ చేస్తే రెన్యువల్, డూప్లికేట్, బ్యాడ్జ్, సరెండర్ ఆఫ్ డీఎల్, అడ్రస్ మార్పిడి, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పేమెంట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
లర్నింగ్ : డూప్లికేట్ లర్నింగ్, కొత్త లర్నింగ్తోపాటు లర్నింగ్ సమయం దాటిన తరువాత ఐప్లె చేసుకోవచ్చు. లర్నింగ్ కోసం స్లాట్ బుకింగ్, లర్నింగ్ టెస్ట్‌కు దరఖాస్తు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
రిజిస్ట్రేషన్ : వాహనాల ఆర్సీలో అడ్రస్ మార్పిడి, వాహనానికి సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
పర్మిట్ : వాహనాల పర్మిట్‌కు సంబంధించిన పేమెంట్, డూప్లికేట్ పర్మిట్, రెన్యువల్ పర్మిట్, టెంపరరీ స్పెషల్ పర్మిట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
సద్వినియోగం చేసుకోవాలి..
వాహనదారులు రవాణా శాఖ కార్యాలయానికి రాకుండా స్మార్ట్ ఫోన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ యాప్ ఫోలియో మొబైల్ అప్లికేషన్ ద్వారా డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలు సులభంగా పొందొచ్చు. ఈ సేవల ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు, సమయం ఆదా అవుతుంది.