లూడో గేమ్‌లో పరిచయం…
లూడో ఆన్లైన్ గేమ్‌లో పరిచయం.. ఉద్యోగం కోసం అంటూ నగరానికి వచ్చి ప్రియుడితో సహజీవనం.. భారీగా ఉన్న అప్పులు తీర్చేందుకు అతడితో కలిసి చైన్ స్నాచింగ్.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఏపీలోని కాకినాడకు చెందిన చేసెట్టి రేవతి(33) అనే మహిళకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు.
- నాలుగు నెలలుగా సహజీవనం
- అప్పులు తీర్చేందుకు లవర్‌తో కలిసి స్నాచింగ్
- జూబ్లీహిల్స్ చైన్ స్నాచింగ్ కేసులో నిందితులకు రిమాండ్
జారాహిల్స్,ఫిబ్రవరి 19: లూడో ఆన్లైన్ గేమ్‌లో పరిచయం.. ఉద్యోగం కోసం అంటూ నగరానికి వచ్చి ప్రియుడితో సహజీవనం.. భారీగా ఉన్న అప్పులు తీర్చేందుకు అతడితో కలిసి చైన్ స్నాచింగ్.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో చైన్ స్నాచింగ్ ఘటనలో మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఏపీలోని కాకినాడకు చెందిన చేసెట్టి రేవతి(33) అనే మహిళకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు.
ఏడాది క్రితం భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుని పిల్లలను తల్లిదండ్రులవద్ద ఉంచి ఉద్యోగం చేస్తానంటూ నగరానికి వచ్చి సనత్‌నగర్‌లో ఉంటోంది. లూడో గేమ్‌తో పాటు ఆన్లైన్ గేమ్స్ అడే అలవాటు కలిగిన రేవతికి ఆన్లైన్లో గుంటూరు జిల్లాకు చెందిన గద్దల నరేంద్ర అలియాస్ నాని(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ చాటింగ్స్ ద్వారా దగ్గరయి సనత్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని 4నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున అప్పులు చేసిన రేవతి వాటిని తీర్చేందుకు ప్రియుడితో కలిసి గత కొన్నిరోజులుగా ప్లానింగ్ చేస్తోంది. ర్యాపిడో డెలివరీ కోసం ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం మాదాపూర్ ప్రాంతంలో డెలివరీ కోసం వెళ్లిన రేవతి, నరేంద్ర జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో టీ స్టాల్ వద్ద వేచి ఉన్నారు. అదే సమయంలో రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మానస అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెడలో గొలుసును గమనించి ఆమెను కొంతదూరం వెంబడించి అదును చూసి స్నాచింగ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలో దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు ఏపీ సరిహద్దు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిందితులు రేవతి, నరేంద్రను అరెస్ట్ చేసి వారివద్దనుంచి 10గ్రాముల బంగారు గొలుసును, స్నాచింగ్‌కు ఉపయోగించిన స్కూటీని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Boyfriend
- Chain snatching
- debts
- job
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

