వనపర్తి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/కొల్లాపూర్ : కోడేరు, పాన్‌గల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు పా న్గల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా నీరందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పాన్‌గల్ బ్రాంచ్ కెనాల్లో పూడికతీత, పిచ్చి మొక్కలు తొలగించి కాలువ ద్వారా పొలాలకు నీరు సులభంగా అందే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో వనపర్తి జిల్లాలోని పాన్‌గల్ బ్రాంచి కాలువ నీటి విడుదల, కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఉన్న పలు కాలువలపై కొల్లాపూర్ ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పాన్‌గల్ బ్రాంచ్ అన్ని కాలువల తూములకు గేట్లు బిగించి నీటి వృథాను అరికట్టాలన్నారు.
పాన్‌గల్ బ్రాంచ్ కెనాల్ పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాలని సూచించారు. నాగులపల్లి తండా వద్ద సైఫన్ ద్వారా జరిగే నీటి వృథాను అరికట్టాలన్నారు. ప్యాకేజీ28 కింద కొల్లాపూర్ నియోజకవర్గంలోని పూర్తి ఆయకట్టుకు నీరందించేందు కు చిన్న కాలువల పని పూర్తిచేయాలన్నారు. తాడిపర్తి, రాజాపేట మధ్య బుద్ధారం ఎడమ కాలువ పనుల కో సం ప్రతిపాదనలు పంపాలని కోరారు. పెద్దమందడి కా లువ కింద ఉన్న ఆయకట్టు కోసం ప్రతిపాదనలు పం పాలన్నారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్ వద్ద గల అలుగు లెవెల్‌ను చెక్‌చేసుకొని సరిచేసుకోవాలని అన్నారు. కల్వకుర్తి ప్రధాన కాలువ కింద డీ5, డీ6 కాలువలను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈలు రవీందర్, సంజీవరావు, డీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆడపడుచులకు సీఎం కేసీఆర్ మేనమామ..
ఖిల్లాఘణపురం, ఆగస్టు 17 : ప్రతి ఆడపడుచుకు సీఎం కేసీఆర్ మేనమామగా ఉండి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.లక్షా116 అందిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థాని క మండల పరిషత్ కార్యాలయంలో 124మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. పేదింటి ఆడ పిల్లల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు భా రం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ క ల్యాణలక్ష్మి తీసుకొచ్చారని గుర్తుచేశారు. పెండ్లిళ్లకు రాకపోయినా లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చే యడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి అండ..
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అండగా ఉంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు. సీఎం సహాయని ధి నుంచి మంజూరైన డబ్బులతో మెరుగైన చికిత్స చే యించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. మండలంలో ఆరుగురికి సీఎం సహాయనిధి చెక్కులను పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జె డ్పీటీసీ సామ్యనాయక్, వనపర్తి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజు, ఎంపీటీసీలు వాణి, ఆశాజ్యోతి, నాయకులు, సర్పంచులు, తాసిల్దార్ సలీంమియా, ఎంపీడీవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు.