అలంపూర్, ఫిబ్రవరి 09: సైన్స్‌తో విశ్వంలో జరిగే మార్పులు గురించి సమాధానం దొరుకుతుంది. విజ్ఞాన అభివృద్ధితో మానవ మనుగడ ముడిపడి ఉందని సైన్స్ ఎక్స్పో 2025 లో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్ పట్టణ సమీపంలో ప్రవేట్ పాఠశాలలో సైన్స్ ఎక్స్పో 2025 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆవిష్కరించిన నూతన టెక్నాలజీ ఆవిష్కరణలకు పాఠశాల దశలోని పునాది పడింది.
సైన్సు, మాథ్స్, భాషా పరమైన అంశాలపై జరిగిన సై న్స్ ఎక్స్పో 2025 లో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న విజ్ఞాన ఆలోచన శక్తి రేపటి భవిష్యత్తు సైన్స్ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ప్రదర్శనలు ఉన్నాయి. సైన్స్ ఎక్స్‌పోలో విద్యార్థులు కొత్త ఆవిష్కరణలను చూసి తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు.