జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామ(Macherla village) సమీప అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలంరేపింది. బలిగేర గ్రామానికి చెందిన ఖయ్యూం(25) మృత దేహాస్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా అనే కోణంలో కేసు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.