ఇచ్చిన ప్రతి హామీ అమలు
సమృద్ధిగా సాగునీరు.. పుష్కలంగా తాగునీరు
మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి
విద్య, వైద్యానికి పెద్దపీట
వనపర్తి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) :టీఆర్ఎస్ ప్రభుత్వంలో వనపర్తి వైభవానికి పునరుజ్జీవం వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మాట తప్పకుండా రూ.వేల కోట్లు మంజూరు చేయడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. ఇచ్చిన హామీలే కాకుండా అనేక అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి మంత్రి నిరంజన్‌రెడ్డి నిధులు తీసుకొచ్చారు. దీంతో జిల్లా సస్యశ్యామలంగా మారింది. ఒకప్పుడు బీడువారిన నేలలు పచ్చటి దుప్పటి పరిచినట్లు పంటలతో కళకళలాడుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
టీఆర్ఎస్ హయాంలో వనపర్తి రూపురేఖలు మారిపోయా యి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సర్కార్ చే యూతతో మంత్రి నిరంజన్‌రెడ్డి జిల్లాను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇచ్చిన హామీ లే కాకుండా అనేక అభివృద్ధి పథకాలకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నిధులు తీసుకొస్తున్నారు. ఒకప్పు డు బీడువారిన నేలలు నేడు పచ్చటి దుప్పటి పరుచుకున్నాయి. ధాన్యపు రాశులతో కల్లాలు కళకళలాడుతున్నాయి. మెడికల్, నర్సింగ్ కాలేజీలు, జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు, డ్రైనేజీ వ్యవస్థ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, లిఫ్ట్‌లు.. ఇలా ప్రతి హామీని నిలబెట్టుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ అదనంగా నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఢోకా లేదు. కరువు, కాటకాలు వచ్చినా నీటికి ఇబ్బంది ఉండొద్దనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు.
ఏడాది పొడవునా చెరువుల్లో నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నా రు. ఏడు టీఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్ నిర్మించారు. కర్నెతం డా ఎత్తిపోతల పథకానికి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, వనపర్తి నియోజకవర్గంలోని గొల్లపల్లి, గణపసముద్రం, ఎర్రగట్టు, బు ద్ధారం స్టేజ్-1, స్టేజ్-2, కిష్టాపూర్ రిజర్వాయర్లకు త్వరలో ఆమోదం లభించనున్నది. అంతేకాకుండా గతంలో పనులు చేపట్టిన రిజర్వాయర్లతో ప్రతి మండలంలో ఒక టీఎంసీని నిలువ ఉంచి స్థానిక అవసరాల నిమిత్తం వాడుకునేందుకు ఉన్న ప్రతిపాదనలకు కూడా త్వరలో మోక్షం దక్కనున్నది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న కాశీంనగర్, కాశీంనగర్ తండా, దత్తాయిపల్లి, దత్తాయిపల్లి తండాలకు సాగునీరు అందించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిపాదించి న కిష్టాపూర్ రిజర్వాయర్ వద్ద మినీలిఫ్ట్తో దాదాపు 1500 ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
చెక్‌డ్యాంలతో జలకళ..
మొదటిదశలో జగత్పల్లి వాగు, చిట్యాల వాగుపై రెండు చొప్పున, ఖిల్లాఘణపురం మండలం వెంకటాంపల్లి వాగు మీద ఒక చెక్‌డ్యాంలను ఇప్పటికే పూర్తిచేశారు. రెండోదశలో చిమనగుంటపల్లి వాగుమీద రెండు, రాజనగరం, కడుకుంట్ల, సల్కెలాపురం, వెల్టూరు, చిల్కటోనిపల్లె, అప్పారెడ్డిపల్లె, కర్నెతండాలో ఒకటి చొప్పున చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో వాగుల మీద వంద చెక్‌డ్యాంల నిర్మాణానికి పూనుకున్నారు.
కాలువలు భళా..
రూ.105 కోట్లతో 25 కిలోమీటర్ల పొడవున ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ నుంచి 12 డిస్ట్రిబ్యాటర్ల ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
రూ.33 కోట్లతో 21 కిలోమీటర్ల పొడవున పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ నుంచి 20 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నారు.
రూ.16.20 కోట్లతో బుద్ధారం ఎడమ కాలువ ద్వారా 10,800 ఎకరాలకు సాగునీరు.
రూ.3.75 లక్షలతో డీ-8 కాలువ కింద ఎంజే-3 నూతన డిస్ట్రిబ్యూటరీ కాలువను నిర్మించి 2,500 ఎకరాలకు సాగునీరు అందించారు.
డీ-8 కాలువ కింద 4వ కాలువను పొడిగించి సవాయిగూడెం, పెద్దగూడెం, కిష్టగిరి గ్రామాలకు సాగునీరు అందించేందుకు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
రూ.1.75 కోట్లతో మోజర్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ), ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి నిరంజన్‌రెడ్డి నిధుల కింద రూ.7 కోట్లు వెచ్చించి దాదాపు 60 మినీ లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. వీటి కింద ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
మౌలిక సౌకర్యాల కల్పన..
మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవ మేరకు సీఎం కేసీఆర్ వనపర్తిని జిల్లాగా ప్రకటించారు. జిల్లాలో వేల కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించారు.
రూ.51.70 కోట్లతో అత్యాధునిక కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.
జిల్లా కేంద్రంలో రూ.49 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు.
రూ.510 కోట్లతో 50 ఎకరాల్లో 600 పడకల మెడికల్ కళాశాల. రూ.29 కోట్లతో నర్సింగ్ కళాశాల.
వీరాయిపల్లిలో 21.20 ఎకరాల్లో రూ.5 కోట్లతో వేరుశనగ పరిశోధన కేంద్రం.
రాజపేట సమీపంలో గొర్రెల పునరుత్పత్తి కేంద్రం.
పెబ్బేరులో మత్స్య కళాశాల.
రూ.700 కోట్లతో వనపర్తి మిషన్ భగీరథ పథకం కింద ప్రత్యేకంగా తాగునీటి వ్యవస్థ ఏర్పాటు.
రూ.10 కోట్లతో మినీట్యాంక్‌బండ్‌గా నల్ల చెరువు పునరుద్ధరణ.
రూ.4 కోట్లతో పెబ్బేరు రహదారిలో ఎకోపార్క్ ఏర్పాటు.
రూ.72 కోట్లతో శ్రీరంగాపురం, సూగూరు, వనపర్తి, కొంకలపల్లి, వీరాయపల్లి, కమాలొద్దీన్పూర్లలో వేర్‌హౌసింగ్ గోదాంలు.
చిట్యాల సమీపంలో రూ.44 కోట్లతో నూతన మార్కెట్‌యార్డు నిర్మాణం పూర్తి.
1400 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి. మిగతా ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి.
రూ.2.80 కోట్లతో పెబ్బేరు రోడ్డులో మార్కెట్ ఏర్పాటుకు శంకుస్థాపన.
ఇరిగేషన్ సీఈ కార్యాలయం, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్‌శాఖ ఎస్ఈ కార్యాలయాల నిర్మాణం.
14 నూతన 33/11 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి.
వనపర్తి పట్టణంలో పాత వ్యవసాయ మార్కెట్ స్థానంలో రూ.19 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణం.
జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు.
గణప సముద్రం రిజర్వాయర్‌కు రూ.44 కోట్లు కేటాయింపు.