మహబూబ్నగర్ : నాటుసారాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కేటీ దొడ్డి మండలం ఇర్కిచేడ్, ఇర్కిచేడ్ తండా, పూజారి తండాలలో పోలీస్, ఆబ్కారీ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. 50 లీటర్ల బెల్లం పానకం, సారా బట్టీలను ధ్వంసం చేశారు. ఎవరైనా నిషేధిత సారాను తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో కేటీదొడ్డి ఎస్సై కురుమయ్య, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.