కోయిలకొండ, ఫిబ్రవరి 25 : మొక్కల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. వాటరింగ్డేను పురస్కరించుకొని మండలకేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో శుక్రవారం మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్నందున మొక్కలకు ప్రతిరోజూ నీటిని అందించి సంరక్షించాలని సూచించారు. కోయిలకొండ ప్రకృతివనంలో మొక్క ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న స ర్పంచ్, అధికారులను అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో స ర్పంచ్ బీ.కృష్ణయ్య, తాసిల్దార్ ప్ర కాశ్, ఎంపీడీవో జయరాం, ఎం పీవో నసీర్‌అహ్మద్, ఏపీవో న ర్సయ్య, పంచాయతీ కార్యదర్శి రమేశ్, టెక్నికల్ అసిస్టెంట్ కార్తీక్ పాల్గొన్నారు.
రోజూ నీరందించాలి
హన్వాడ, ఫిబ్రవరి 25 : వేస వి దృష్ట్యా మొక్కలకు ప్రతిరోజూ నీరందించి సంరక్షించాలని డీపీవో వెంకటేశక్వర్లు అన్నారు. మండలంలోని ఏనెమీదితండా, కొత్తపేట గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ మొక్కల సంరక్షణపై సర్పంచు లు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే నర్సరీల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు మొ క్కలు పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచులు సరోజ, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ కాపాడాలి
నవాబ్‌పేట, ఫిబ్రవరి 25 : నాటిన ప్రతి మొక్కనూ కా పాడాలని మండల ప్రత్యేకాధికారి, డీసీవో సుధాకర్ అన్నా రు. వాటరింగ్డే సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవా రం విధిగా వాటరింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీడీవో శ్రీలత, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, సర్పంచులు గోపాల్‌గౌడ్, యాదయ్యయాదవ్, వెంకటేశ్, నాయకులు ప్రతాప్, హన్మం తు, నర్సింహులు, చెన్నయ్య ఉన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
జడ్చర్ల, ఫిబ్రవరి 25 : హరితహారం మొక్కలు ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో జగదీశ్ సూచించారు. మండలంలోని గొల్లపల్లి, మాచారం, చిట్టబోయిన్పల్లి గ్రామాల్లో శుక్రవారం పల్లెప్రకృతి వనాలతోపాటు హరితహారం మొక్కలను పరిశీలించారు. అలాగే వాటరింగ్డే సందర్భంగా మొక్కలకు నీరు పోశారు. పంచాయతీ కార్యదర్శులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో వెంట గొల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, రాజేశ్వరి, శ్రీశైలం ఉన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఫిబ్రవరి 25 : మండలంలోని పెద్దాయపల్లి, ఊటకుంటతండా, వాయిల్‌కుంటతండా, బోడగుట్టతండా ల్లో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు మొక్కల కు నీరు పోశారు. అలాగే అప్పాజీపల్లిలో ఇన్చార్జి ఎంపీడీవో శ్రీదేవి పర్యటించి హరితహారం మొక్కలు, పల్లెప్రకృతి వనం, క్రిమిటోరియం తదితర పనులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. బోడజానంపేట గ్రామంలో మొక్కలకు నీరు పోశారు. మొక్కలకు సకాలంలో నీరందించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచులు శంకర్, గోపీనాయక్, రమేశ్‌నాయక్, లలితామంజూనాయక్ పాల్గొన్నారు