Gadwala | మార్చురీలో ఫ్రీజర్లు లేవని మృతదేహాలను ఆరుబయటే వదిలేసిన అధికారులు
బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు కనీస వసతులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానలు నేడు కనీస వసతులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జనం సర్కార్ దవాఖానకు రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా గద్వాలలోని గవర్నమెంట్ హాస్పిటల్లో సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో అధికారులు మృతదేహాలను ఆరుబయటే వదిలేశారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(48) మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రాత్రి 8:40 గంటలకు పోలీసులు మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించగా, మార్చురీలో ఫ్రీజర్ పనిచేయడంలేదని, అధికారుల అనుమతి ఉంటేనే మార్చురీలోకి మృతదేహాన్ని తీసుకెళ్తామని దవాఖాన సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక దాదాపు రెండు గంటల పాటు వేచి చూసి మృతదేహాన్ని పోలీసులు మార్చురీ బయటే వదిలేసి వెళ్లారు.
అయితే మార్చురీలో గత కొద్ది రోజులుగా ఫ్రీజర్లు పనిచేయడంలేదని, బయట మార్కెట్ నుండి ఫ్రీజర్ తెప్పించి మృతదేహాని భద్రపరుస్తున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఝాన్సీలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ దవాకానలో కనీసం మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ కూడా పనిచేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు
మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో, మృతదేహాలను ఆరుబయటే వదిలేసిన అధికారులు
గద్వాల జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి(48) మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
దీంతో రాత్రి 8:40 గంటలకు… pic.twitter.com/8Lmt4vXWZb
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

