నారాయణపేట టౌన్, ఆగస్టు 15 : 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన స్టాళ్ల ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్శ ర్మ హాజరు కాగా, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ హాజరయ్యారు. పశుసంవర్ధక శాఖ, మిషన్ భగీరథ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ, బీసీ అభివృద్ధ్ది, చేనేత, జౌళి, విద్య, పౌర సరఫరాల శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శా ఖ, వ్యవసాయ తదితర శాఖలకు సంబంధించి చేపడుతు న్న సంక్షేమ పథకాలపై అధికారులు స్టాళ్లను ఏర్పాటు చేశా రు. స్టాళ్లను సందర్శించి, వాటి వివరాలు అడిగి తెలుసుకొ ని నిర్వాహకులను అభినందించారు.
జిల్లా అభివృద్ధిలో వివిధ శాఖల పరిధిలో విశేషంగా కృ షి చేసిన జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బందిని ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్‌శర్మ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. అదేవి ధంగా జిల్లాలోని 16,106 మంది రైతులకు సంబంధించిన రూ.54కోట్ల 40లక్షల రుణమాఫీ చెక్కును జిల్లా వ్యవసాయశాఖ అధికా రి జాన్ సుధాకర్, ఎల్డీఎం ప్రసన్నకుమార్‌కు అందజేశారు. రెడ్‌క్రాస్ ద్వారా చేపడుతు న్న పలు సేవా కార్యక్రమాలకుగానూ ఆర్థికం గా తమవంతు సహాయాన్ని అందించిన వారి కి రెడ్‌క్రాస్ పట్రాన్ సభ్యత్వం ఐ.డి కార్డుల ను అందజేశారు.
పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన శకటాల ప్ర దర్శన నిర్వహించారు. డీఆర్డీఏ, వ్యవసా యం, మిషన్ భగీరథ, సంచార పశువైద్యశాల, చేనేత, జౌళిశాఖ, జ్యూవెల్లరి మర్చంట్, రెడ్‌క్రాస్ సొసైటీల ద్వారా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. అదేవిధంగా విద్యార్థులు నిర్వహించిన కరాటే ప్రదర్శన చూపరులను కనువిందు చేశాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.