పెద్దకొత్తపల్లి, ఆగస్టు 13: మైసమ్మ ఆలయ అభివృద్ధి కోసం పాలకమండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయం వద్ద 14మంది నూతన పాలక మండలి సభ్యులతో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రావు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మైసమ్మ వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. నూతనంగా ఎన్నుకున్న సభ్యులను పూలమాల, శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మైసమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. మైసమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం నిర్మాణానికి తనవంతు కృషిచేస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గౌరమ్మ, చైర్మన్ శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ రాజగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, రాంలాల్, మండల నాయకులు గణేశ్‌రావు, చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, నాగరాజు, రాజశేఖర్, గోవిందు, మోహన్‌రెడ్డి, మైసమ్మ ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి, ధర్మారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, సింగిల్‌విండో డైరెక్టర్ సాయిప్రసాద్రావు, యాదగిరిశెట్టి తదితరులు ఉన్నారు.
అంగన్వాడీ సిబ్బందికి నియామకపత్రాలు
ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు 14మందికిగానూ శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి తొమ్మిది మందికి నియామకపత్రాలు అందజేశారు. ఎంపికైన మిగతా ఐదుగురిలో ఒకరు ఉద్యోగంలో చేరుటకు నిరాకరించారు. మిగతా నలుగురికి సోమవారం నియామకపత్రాలను అందజేయనున్నట్లు సీడీపీవో వెంకటరమణ తెలిపారు. అయితే నియామకపత్రాలను తీసుకున్న వారిలో కోడేరు మండలం తుర్కదిన్నె అంగన్వాడీ టీచర్‌గా రుక్ముణి, పాతయాపట్ల అంగన్వాడీ టీచర్‌గా చంద్రకళ, ఎల్లూరు మినీ సెంటర్‌కు అనిత, జగన్నాథపురంలో హెల్పర్లుగా శివలీల, మరికల్ రెండో సెంటర్లో మైబా, గోప్లాపూర్‌లో దివ్యవాణి, ముత్తిరెడ్డిపల్లిలో చంద్రకళ, సాతాపూర్ మూడో సెంటర్లో శివలీల, మాచుపల్లిలో చంద్రకళ ఉన్నారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటరమణ, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
జ్వరపీడితులందరికీ మెరుగైన వైద్యం
కొల్లాపూర్ రూరల్, ఆగస్టు 13: వానకాలం సీజన్లో గ్రామాలు, పట్టణాలు తేడాలేకుండా జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తతతో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలోని 10వ వార్డులోని 7, 18వ అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బీరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలోఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్నారని, వారికి స్వాంతన చేకూరేవరకు హెల్త్‌క్యాంపు కొనసాగించాలన్నారు. ప్రస్తుతం సీజన్లో చాలామందికి డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయన్నారు. వాటిని తక్షణం కంట్రోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏఎన్ఎంలు, ఆశల సహకారంతో ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులను గుర్తించి వైద్యం చేయాలని సూచించారు. వైద్యశిబిరానికి వచ్చిన చాలామంది జ్వరపీడితులను ఎమ్మెల్యే బీరం పలుకరిస్తూ జ్వరం తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఎంపీపీ భోజ్యానాయక్, కొల్లాపూర్ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, పెంట్లవెల్లి పీహెచ్సీ డాక్టర్ చంద్రశేఖర్, వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్ సరస్వతి, మహేశ్, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాలనీవాసులు పాల్గొన్నారు.