Shekar Kammula | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వారసుడి అరంగేట్రం?
Akira Nandan Grand Debut | టాలీవుడ్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ వార్తలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ వెండితెర అరంగేట్రం వార్త ఒకటి.
Akira Nandan Grand Debut | టాలీవుడ్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ వార్తలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ వెండితెర అరంగేట్రం వార్త ఒకటి. ఆరడుగుల ఎత్తు, తండ్రికి తగ్గ వారసుడిగా ఇప్పటికే అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న అఖిరా ఎప్పుడు హీరోగా మారుతాడా అని మెగా ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లాంచ్ కోసం అందరూ ఒక మాస్ యాక్షన్ దర్శకుడిని ఊహిస్తుండగా, అనూహ్యంగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు తెరపైకి రావడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా స్టార్ కిడ్స్ భారీ యాక్షన్ డ్రామాలు లేదా కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కుమారుడికి ఒక బలమైన కథా నేపథ్యం ఉన్న సినిమాతో పునాది వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ములకు ఈ బాధ్యత అప్పగించినట్లు సమాచారం.
ఈ క్రమంలో గతంలో శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్ళీ చర్చకు దారితీస్తున్నాయి. పవన్ రాజకీయ వైఖరిని ప్రశ్నిస్తూ కమ్ముల గతంలో చేసిన పోస్ట్‌లు ఇప్పుడు అభిమానుల మధ్య చిన్నపాటి వివాదానికి కారణమవుతున్నాయి. అయినప్పటికీ, సినిమా అనేది ఒక కళ అని, వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకు వృత్తిపరమైన సినిమాలకు సంబంధం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, అఖిరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న వీడియోలు చూసి అతను పక్కా మాస్ హీరోగా కనిపిస్తాడని ఆశించిన అభిమానులకు, శేఖర్ కమ్ముల లాంటి ‘క్లాస్’ డైరెక్టర్ ఎంపిక కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కానీ, కమ్ముల మార్క్ ట్రీట్మెంట్ అఖిరాను కేవలం మాస్ ఆడియన్స్‌కే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గర చేస్తుందని, ఇది దీర్ఘకాలిక కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికార ప్రకటన వచ్చేవరకు ఇది కేవలం రూమర్ అని అభిమానులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

