MLA Vijayudu | బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. దవాఖానలో విద్యార్థులను పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు.
గద్వాల: అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహ విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ హాస్టల్లో పుడ్ పాయిజన్ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ నర్సింగరావు తదితరులు విద్యార్థులను పరామర్శించారు.

బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమైంది (Food Poison). దీంతో 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకున్నారని, ప్రస్తుతం దవాఖానలో 32 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

