జోగులాంబ గద్వాల : జిల్లాలోని ధరూర్ మండలం పరిధి భీంపురం వద్ద జూరాల కుడికాలువ మీద ఉన్న వంతెన కూలిపోయింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గద్వాల బండ్ల కృష్ణమెహన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమీపంలోనే తాత్కాలిక వంతెన సిద్ధం చేయాలని, రాకపోకలు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అలాగే వంతెన నిర్మాణానికి సంబంధించి ఎస్టిమేషన్ వెంటనే తయారు చేయాలని, హైదరాబాద్ లోనిENC అధికారులతో మాట్లాడి త్వరగా నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. భీంపురం బ్రిడ్జితో పాటు గద్వాల పట్టణం నుంచి అగ్రహారం వెళ్లే బ్రిడ్జి వంతెన నిర్మాణం కూడా ఆరు నెలల లోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.