జోగులాంబ గద్వాల : కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో.. సరిపడా కరెంటునిస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బీఆర్ఎస్ పార్టీ కావాలో రైతులు తేల్చుకోవాలని గద్వాల ఎమ్మెలో నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. సాగుకు 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.
రైతు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంటే ఆర్థికంగా ఎదగడం చూసి ఓర్వలేక రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. రాష్ట్రంలో రైతులు అభివృద్ధి చెందు తుంటే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి.
మూడు గంటల కరెంటు మాకు వద్దు. కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంటు మాకు కావాలని కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, గట్టు మండలం పార్టీ అధ్యక్షుడు, రైతు బంధు సమితి అధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.