Rajinikanth | 175వ సినిమాతో రజనీకాంత్ రిటైర్మెంట్ .. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?
Rajinikanth | తమిళ సినీ పరిశ్రమతో పాటు భారతీయ సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన స్టైల్, మేనరిజమ్స్, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
Rajinikanth | తమిళ సినీ పరిశ్రమతో పాటు భారతీయ సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన స్టైల్, మేనరిజమ్స్, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్త అభిమానుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, రజనీకాంత్ తన 175వ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత నటనకు వీడ్కోలు పలకాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు రజనీకాంత్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ తన చివరి సినిమాగా జననాయగన్‌ని ప్రకటించారు. రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు అదే తరహాలో రజనీకాంత్ కూడా తన 175వ చిత్రం తర్వాత రిటైర్ అవుతారనే ప్రచారం రావడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, కోలీవుడ్‌లో రెండు అగ్ర తారల సినీ ప్రయాణం ముగిసినట్లే అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. “ఒక యుగానికి ముగింపు”, “కోలీవుడ్ సూపర్ స్టార్ల ఎరా ముగుస్తుందా?” అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే రజనీకాంత్ రిటైర్మెంట్పై ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాబా’, ‘కాళా’, ‘కూలీ’ సినిమాల సమయంలో కూడా ఆయన సినిమాలకు వీడ్కోలు పలుకుతారనే ప్రచారం జరిగింది. కానీ ప్రతి సారి ఆ వార్తలు కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయి. ఈసారి కూడా 175వ సినిమా తర్వాత రిటైర్మెంట్ వార్తలపై అధికారిక క్లారిటీ లేకపోవడంతో, దీనిని ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే సినీ వర్గాలు చూస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ తన 173వ చిత్రం ‘ధర్మన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించగా, అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మరోవైపు, ఆయన నటించిన ‘జైలర్ 2’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాతే ఆయన తదుపరి ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

